Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నభూతో నభవిష్యతి... ఈశా పెళ్లి తరువాత హారతి వీడియో!

  • ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు
  • వైభవంగా సాగిన ఈశా అంబానీ వివాహం
  • శ్రీకృష్ణునికి హారతి కార్యక్రమం అదుర్స్
ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు... విందు వినోదాలు, సరదా సంతోషాలు...!
సాధారణ పెళ్లిళ్లే ఓ రేంజ్ లో జరుగుతుంటే, ఇండియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లంటే...!
ఊహించిన స్థాయిని మించి తన కుమార్తె పెళ్లిని జరిపించారు ముఖేష్. విదేశీ అతిథులు, సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు, వేలాది మందిగా హాజరైన ఈ వివాహ వేడుక సందర్భంగా శ్రీ కృష్ణునికి హారతి ఇచ్చే కార్యక్రమం నభూతో న భవిష్యతి అనే రేంజ్ లో సాగింది. ఈ హారతి వీడియోను మీడియా కోసం రిలయన్స్ విడుదల చేసింది. అమెరికా మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ స్వయంగా కృష్ణునికి హారతి ఇచ్చారు. సముద్ర తీరంలో దాదాపు 50 అడుగులకు పైగా ఎత్తయిన కృష్ణ విగ్రహం ఏర్పాటు చేసి, దాని ముందు భారీ సెట్టింగ్ వేయగా, సుమారు 1000 మందికి పైగా పెళ్లికి వచ్చిన ప్రముఖులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 'ఓం జై జగదీశ్ హరే' అంటూ లయబద్ధంగా పాట వినిపిస్తుండగా ఈ కార్యక్రమం సాగింది. అంతకుముందు అదే వేదికపై నీతా అంబానీ సహా పలువురు స్టార్స్ నృత్యాలు చేశారు.
Mukesh Ambani
Esha ambani
Marriage
aarti

More Telugu News